సీఎం ఆఫర్.. ఎన్టీఆర్ మాత్రం నో

53
- Advertisement -

నేడు సీనియర్ ఎన్టీఆర్ గారి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సభకు చాలామంది సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు హాజరవుతున్నారు. ఐతే, ఈ క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన పలు అంశాల పై నెటిజన్లు ముచ్చట్లు పెడుతున్నారు. తెలుగులో ఒక అగ్ర కథానాయకుడి బ‌యోగ్ర‌ఫీ పుస్తక రూపంలో రావడమన్నది ఎన్టీఆర్‌తోనే ప్రారంభమైంది. ఆ తర్వాతే మిగిలిన హీరోలపై అనేక పుస్తకాలొచ్చాయి. ఈ జోన‌ర్‌లో ఎక్కువ‌ సంఖ్యలో పుస్తకాలు వచ్చింది ఎన్టీఆర్ పైనే. ఆయన జీవితకథ ‘కథ కాని కథ’ పేరుతో 1964లో తొలిసారిగా పుస్తక రూపంలో తెచ్చింది ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ గౌతమ్‌.

ఆ త‌ర్వాత‌ ఇలా 40కి పైగా ఎన్టీఆర్‌పై వివిధ కోణాల్లో పుస్తకాలొచ్చాయి. మొత్తమ్మీద సీనియర్ ఎన్టీఆర్‌తోనే బ‌యోగ్ర‌ఫీలు ఆరంభం కావడం నిజంగా విశేషం. అలాగే మరో టాపిక్ కూడా వైరల్ అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోకు సమీపంలోనే 20 ఎకరాలు ఇస్తానని, మ‌రో స్టూడియోను క‌ట్ట‌మ‌ని అప్ప‌టి ఆంధ్రప్రదేశ్ సీఎం జలగం వెంగళరావు సీనియర్ ఎన్టీఆర్‌ను కోరారు. ఐతే, సీనియర్ ఎన్టీఆర్ మాత్రం తనకు ప్రభుత్వ స్థలం అక్కర్లేదనీ, గోల్కొండ చౌరస్తాలోని త‌న‌ సొంత స్థలంలోనే స్టూడియో క‌డ‌తాన‌ని ఎన్టీఆర్ చెప్పారట.

Also Read: SURIYA:నీ మృతికి నివాళిగా రాస్తున్న అక్షరాలు కావు

దాంతో అప్పటి సీఎం జలగం వెంగళరావు ఆశ్చర్యపోతూ.. ప్రభుత్వ స్థలాన్ని వద్దు అని చెప్పిన మొదటి వ్యక్తి మీరేనేమో అని నవ్వారట. ఆ మాటకు ఎన్టీఆర్ కూడా అయితే ఇది బాధ పడాల్సిన అంశం వెంగళరావు గారు అని బదులిచ్చారు. అనంతరం చాలామంది ఎన్టీఆర్ తో.. ‘మీరు కేవలం మూడెకరాల్లో స్టూడియో ఎలా కడతారని అడిగితే, కట్టి చూపిస్తా చూడండ‌ని రామకృష్ణ స్టూడియోను నిర్మించి, ‘దానవీరశూర కర్ణ’ షూటింగ్‌ తో ఆ స్టుడియోని ఎన్టీఆర్ ప్రారంభించారు.

Also Read: బాలయ్యతో రొమాన్స్ పై తమన్నా క్లారిటీ

- Advertisement -