జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను తక్షణమే పదవికి రాజీనామా చేయాలని నితీష్ డిమాండ్ చేశారు. ఆర్జేడీ మద్దతుతోనే రాష్ట్రంలో నితీష్ ప్రభుత్వం ఏర్పడింది.. లాలూ ప్రసాద్ యాదవ్ తన కొడుకు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయడంటూ తెగేసి చెప్పిన క్రమంలో నితీష్ రాజీనామా చేశారు..
ఈ సంధర్బంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ఇబ్బందులు పరిష్కరించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసినట్టు తెలిపారు.. తాను అనుకున్న దారిలో పోలేకపోతున్నానని అన్నారు. నీతిమంతమైన పాలన ఇవ్వడానికి ప్రయత్నించానన్నారు. అవినీతి కేసుల్లో నిజాయితీ నిరూపించుకోవాలని కోరామన్నారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కలిసి పనిచేయాలేమన్నారు. అందుకే రాజీనామా చేశానని.. రాజీనామా లేఖను ఇంఛార్జ్ గవర్నర్‌కు అందజేశినట్టు తెలిపారు. బీహార్ ప్రజల మేలు కోరే రాజీనామా చేసినట్టు తెలిపారు నితీష్..
లాలూ కుటుంబసభ్యులపై వరస సీబీఐ దాడులు బిహార్ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీష్ కేంద్రంతో చేతులు కలిపి తమ కుటుంబ సభ్యులపై దాడులు చేయిస్తున్నారని లాలూ భావిస్తున్నారు. దీంతో ఆర్జేడీ, జేడీయూ మధ్య కొద్ది రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మహాగద్బంధన్ నుంచి తప్పుకోవాలని ఇరు పార్టీలు భావించే వరకు వ్యవహారం వెళ్లింది.
క్లీన్ ఇమేజ్‌తో రావాలంటూ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు నితీస్ అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని తేల్చి చెప్పారు. దీంతో లాలూ తన రాజకీయ చతురతను ఉపయోగించి మహాగడ్బంధన్‌కు బీటలు వారకుండానే జేడీయూపై యుద్ధం ప్రకటించారు. కుమారుడు తేజస్వీకి రాజీనామా చేయవద్దని సూచించారు. ఒక వేళ మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్ చేస్తే, మిగతా మంత్రులు కూడా రాజీనామా చేసి నితీష్ సర్కార్‌కు బయట నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.