ఆడపడచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షాలు

119
- Advertisement -

రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆఖరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల మధ్య ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆటా పాటలతో, పల్లెలు పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్నాయని అన్నారు.

విజయాలనందించే విజయ దశమిని స్వాగతిస్తూ ముగిసే తొమ్మిది రోజుల #బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని సీఎం తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా వర్దిల్లేలా, ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా దీవించాలని మరోసారి అమ్మవారిని సీఎం ప్రార్థించారు.

ఇసుకల పుట్టెను గౌరమ్మ..ఇసుకల పెరిగెను గౌరమ్మ..ఇసుకల వసంతం గౌరమ్మ అన్నారు మంత్రి హరీశ్ రావు. పూలను పూజించే,ప్రకృతిని దేవతగా ఆరాధించే మన సంస్కృతి, సాంప్రదాయ పండుగ బతుకమ్మ.. ఆడపడుచులు తీరొక్క పూలతో కన్నుల పండుగగా చేసుకొనే గొప్ప పండగ మన బతుకమ్మ..ప్రజలందరికి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అని తెలిపారు.

- Advertisement -