శ్రీవారి సన్నిధిలో సీఎం కేసీఆర్ సతీమణి

54
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం కేసీఆర్ సతీమణి శోభ. అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం వారు శ్రీకాళహస్తి వెళ్లారు. శ్రీకాళహస్తి ముక్కంటి సన్నిధిలో కేసీఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకుముందు ఆలయంవద్ద వారికి అర్చకులు, వేద పండితులు స్వాగతం పలకగా సీఎం కేసీఆర్ సతీమణికి టీటీడీ ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సోమవారం రాత్రి తిరుమలలోనే బస చేసిన ఆమె.. మంగళవారం ఉదయం అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఇక ఎన్నికల షెడ్యూల్ రావడంతో సీఎం కేసీఆర్ రణరంగంలోకి దిగారు. ఈ నెల 15న పార్టీ మేనిఫెస్టో, పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్ అందజేయనున్నారు. అనంతరం అదే రోజు హుస్నాబాద్‌లో జరిగే భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ఇక నవంబర్ 9న కామారెడ్డి, గజ్వేల్ రెండు చోట్ల నుండి నామినేషన్ దాఖలు చేయనున్నారు సీఎం కేసీఆర్.

Also Read:Bigg Boss 7 Telugu:ఆరో వారం మొదలైంది రచ్చ..

- Advertisement -