యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి పుణ్యక్షేత్రానికి చాలా విశిష్టత ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నేడు యాదాద్రి పర్యటనలో భాగంగా స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్దికి నోచుకోలేదన్నారు. అలాగే వెయ్యి ఎకరాలలో టెంపుల్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. స్ధల సేకకరణకు ప్రభుత్వం తరపున 70కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
యాదాద్రి ప్రపంచంలోనే యూనిట్ టెంపుల్ అని చెప్పారు. మరో 15 రోజుల్లో యాదాద్రికి వచ్చి మళ్లీ పనులను పరిశీలిస్తానని తెలిపారు. ఆలయాలు ఒక తరం నుంచి మరోక తరానికి సంస్కృతిని, సంస్కారాన్ని తెలియజేస్తాయని స్పష్టం చేశారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం చాలా వైభవంగా జరుగుతోందన్నారు.
యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి 133 దేశాల నుంచి వైష్ణవ పండితులు వస్తారని తెలిపారు. 1008 హోమ గుండాలతో ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. అష్టదశ శక్తి పిఠాల్లో మహాబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ ఒకటి. గత పాలకులు జోగులాంబ శక్తీ పిఠాన్ని పట్టించుకోలేదన్నారు సీఎం కేసీఆర్. నిత్యాన్నదాన సత్రాలు, బస్‌స్టేషన్, ఇతర నిర్మాణాలు చేపడుతాం. ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ నిర్మాణం సాగుతోందని కేసీఆర్ చెప్పారు