దళితులతో అప్యాయంగా ముచ్చటించిన ముఖ్యమంత్రి..

68
cm kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం తాను దత్తత తీసుకున్న గ్రామం వాసాలమర్రిలో పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన.. యాదాద్రి జిల్లా వాసాలమర్రికి చేరుకుని, దళితవాడల్లో కలియ తిరిగారు. దళిత వాడల్లో పాదయాత్ర చేస్తూ దళితులతో ముచ్చటిస్తున్న.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

అనంతరం స్థానికంగా ఉన్న రైతువేదికలో గ్రామస్థులతో ఆయన సమావేశమయ్యారు. తర్వాత గతంలో ఇచ్చిన హామీల అమలు తీరుపై అధికారులతో సమీక్షిస్తారు. జూన్ 22న వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. నాడు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంపై సమీక్ష చేసేందుకు 42 రోజుల తర్వాత మళ్లీ ఆయన వాసాలమర్రికి వెళ్లారు. తదుపరి కార్యాచరణపై నేతలు, అధికారులు, గ్రామస్థులకు దిశానిర్దేశం చేయనున్నారు.