చైతన్యంలో సూర్యపేట ముందంజలో ఉందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణను ఏవిధంగా అభివృద్ధి చేయాలో టీఆర్ఎస్‌కు తెలిసినంతగా మరెవరికి తెలియదన్న సీఎం… ఆరవై సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నల్లగొండ జిల్లాలో 4 వేల మెగావాట్లతో దామరచర్ల వద్ద యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం చేపట్టామన్నారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడలో నూతన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు సీఎం కేసీఆర్ భూమిపూజ నిర్వహించారు. అనంతరం జూనియర్ కాలేజీలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడారు. ఉద్యమ సమయంలో సూర్యపేట జిల్లా చేస్తానని చెప్పానని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినమాటను నేరవేర్చుకున్నాని తెలిపారు.
గత పాలకులు నల్లగొండ జిల్లా సమస్యలను పట్టించుకోలేదన్నారు. నాగార్జునసాగర్ అసలు పేరు నందికొండ ప్రాజెక్టు అని చెప్పిన కేసీఆర్ కాంగ్రెస్‌ని జిల్లాను సర్వనాశనం చేసిందన్నారు. నాగార్జున సాగర్‌ని ఏలేశ్వరం దగ్గర నిర్మించాల్సి ఉందని కాదని వేరేచోట నిర్మించారన్నారు.
లక్ష మంది ఉత్తమ్ కుమార్‌లు అడ్డపడ్డ జిల్లా అభివృద్ధి ఆపలేరన్నారు. సమైక్యపాలనలో నల్లగొండ, పాలమూరు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. కాళేశ్వరం పూర్తైతే కోదాడ,సూర్యపేటకు నీళ్లు వస్తాయని తెలిపారు.తెలంగాణ అభివృద్ధికోసం చివరిశ్వాస వరకు పనిచేస్తానని తెలిపారు.పులిచింతల ముంపు బాధితులకు సరైన పరిహారం ఇవ్వలేదన్నారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు వద్ద 65వేల క్యూసెక్కుల కాలువ తవ్వితే కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేదన్నారు.
సూర్యపేట జిల్లాపై వరాల జల్లుకురిపించారు సీఎం. బంగారు తెలంగాణ సాధనలో వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని తెలిపారు. సూర్యపేట జిల్లాలో 323 గ్రామపంచాయతీల అభివృద్ధికి 15 లక్షల రూపాయలు మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు. 323 లంబాడీ తండాల అభివృద్ధికి రూ. 10 లక్షలు మంజూరుచేస్తున్నామన్నారు. మూసి కాలువల ఆధునీకరణకు రూ. 60 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సూర్యపేట జిల్లాపై తనకు ఎనలేని ప్రేమ ఉందన్నారు. పాత నల్గొండ జిల్లాలో వచ్చే బడ్జెట్‌లో రెండు మెడికల్ కాలేజీలు(నల్లగొండ,సూర్యపేట) కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సూర్యపేటలో బంజారాభవన్ నిర్మాణం చేపడతామన్నారు. సూర్యపేట పట్టణానికి రూ.75 కోట్లు మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు. వీటన్నింటికి సంబంధించి రేపే జీవో విడుదల చేస్తామన్నారు.