వనదేవతల సన్నిధిలో సీఎం కేసీఆర్

216
CM KCR visits Medaram jatara
- Advertisement -

మేడారం సమ్మక్క సారళమ్మలను దర్శించుకున్నారు సీఎం కేసీఆర్. అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్ సతీసమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు. దేవతలపై పసుపు,కుంకుమలు చల్లారు. అంతకముందు వన దేవతలకు నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) సమర్పించారు సీఎం దంపతులు,ఎంపీ కవిత.సీఎం రాక సందర్భంగా జాతర ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం సతీమణి శోభ, మనవడు హిమాన్షు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

kcr

నాలుగు రోజుల మహా జాతర ప్రధాన ఘట్టం సమ్మక్క రాకతో పతాకాస్థాయికి చేరుకున్నది. మేడారం భక్త జన సంద్రమైంది. భక్తకోటి పోటెత్తడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మేడారం పరిసరాలల్లో లక్షలాదిగా భక్తజనం సేద తీరుతున్నారు.. తమ కొంగు బంగారమైన సమ్మక్క- సారలమ్మ తల్లుల ఆశీర్వచనాల కోసం ఎదురుచూస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌, పడ మర మహారాష్ట్ర నుంచి గోదావరి నది దాటి లక్షలా దిగా మేడారంకు చేరుకుంటున్నారు.

- Advertisement -