వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్..

541
cm kcr medaram
- Advertisement -

మేడారంలో వనదేవతలను దర్శించుకున్నారు సీఎం కేసీఆర్.తల్లులకు నిలువెత్తు బంగారంతో పాటు చీర,సారెలను సమర్పించి మొక్కలు చెల్లించారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు సీతక్క,రాజయ్య,గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు.

ఇక ఇవాళ ఉదయం గవర్నర్లు తమిళిసై సౌందర్‌ రాజన్‌, బండారు దత్తాత్రేయ వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. వీరికి మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఘన స్వాగతం పలికారు. వనదేవతల పూజారులు అమ్మవార్ల ప్రసాదాలను గవర్నర్‌ తమిళిసైకు అందజేశారు.
గవర్నర్లు, సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మేడారంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వనదేవతలంతా గద్దెలపైనే ఉండడంతో మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. దర్శనాల కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఇవాళ, రేపు గద్దెలపైనే వనదేవతలు ఉంటారు. శనివారం సాయంత్రం వన ప్రవేశం చేయనున్నారు అమ్మవార్లు.

- Advertisement -