ఆదిలాబాద్..తెలంగాణ కాశ్మీరం

226
CM KCR tour in Adilabad
- Advertisement -

మూడు జిల్లాల పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ వరాలజల్లు కురిపించారు. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ కాశ్మీరం అని కొనియాడారు. డైట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సమావేశంలోమాట్లాడిన సీఎం ఆదిలాబాద్ పట్టణంలో మినీ ఎరోడ్రామ్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన అనుమతులను తర్వలోనే వస్తాయన్నారు. ఇక అగ్రికల్చర్, మరాఠీ కాలేజీలను మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

గిరిజనుల అభివృద్ధి కోసం రూ. 78 కోట్లు,ముస్లిం సోదరుల కోసం 17 కోట్లు,దళిత సోదరుల అభివృద్ధికి రూ. 7 కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి అదనంగా వెయ్యి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తుమని ప్రకటించిన సీఎం… ఆదిలాబాద్ నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలకు రూ. 75 కోట్లు కేటాయిస్తామని సీఎం వెల్లడించారు.

బోథ్ నియోజకవర్గంలో రూ. 210 కోట్లతో గోముత్రి రిజర్వాయర్ నిర్మాణం చేపడుతామన్నారు. దీని ద్వారా బోథ్, ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూరనుంది. బాసర ఆలయం అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కడెం ప్రాజెక్టుకు రూ. 870 కోట్లు మంజూరు చేస్తున్నాం, ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి మరో రూ. 85 కోట్లు కేటాయిస్తామన్నారు. కాళేశ్వరం ద్వారా ముథోల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం. తెలంగాణ ధనిక రాష్ట్రం.. నిధులకు కొదవ లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలి.. బేధాభిప్రాయాలతో మనకే నష్టమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఈ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని సీఎం ఆగ్రహం వెలిబుచ్చారు.

- Advertisement -