- Advertisement -
మార్చి 8వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వనపర్తి జిల్లా పర్యటన చేపట్టనున్నారు.. ఇందులో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ముందుగా వనపర్తి నుండి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే జిల్లాలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కన్నెతండా లిఫ్ట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత వనపర్తిలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను, అలాగే టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
- Advertisement -