యాదాద్రికి సీఎం కేసీఆర్

505
CM-Yadadri-
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. తుదిదశలో ఉన్న పనులను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేయడానికి శనివారం యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయ పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం.

ఉదయం 11.00గంటలకు యాదాద్రికి చేరుకొనున్న సీఎం ముందుగా స్వామివారిని దర్శించుకుంటారు. తర్వాత యాదాద్రిలో రింగ్ రోడ్డు పనులను పర్య వేక్షిస్తారు. త్వరలోనే సుదర్శన యాగం నిర్వహించాలని నిర్ణయించినందున..   యాగం ఏర్పాట్ల పై అధికారులతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కొండపైన నిర్మాణమవుతున్న ప్రధానాలయ పనులపై సీఎం కేసీఆర్ హోటల్ హరితలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ సమీక్షలో పాల్గొంటారు.

- Advertisement -