- Advertisement -
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తల్లి తారకమ్మ (105) జులై 22వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు తారకమ్మ దశదినకర్మ నిర్వహిస్తున్నారు. ఈ సంర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ తారకమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం నిరంజన్‌రెడ్డిని పరామర్శించారు. సీఎంతో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, జిల్లాకు చెందిన అధికారులు, పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -