లష్కర్‌ బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌..

458
Lashkar Bonalu kcr
- Advertisement -

ఆషాడమాసం సందర్భంగా సికింద్రాబాద్‌ శ్రీ మహంకాళీ అమ్మవారి భోనాలు నేడు ప్రారంభమైయ్యయి. ఈ బోనాల వేడుకలో సీఎం కేసీఆర్‌ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

సీఎం కేసీఆర్ క్యూలో నిల్చున్న భక్తులకు అభివాదం చేశారు. అంతకుముందు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలతోపాటు అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి మంత్రి అమ్మవారిని దర్శించుక్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ పండితులు, మంత్రులు, అధికారులు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కోసం ఆదివారం ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు.

- Advertisement -