ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ పరామర్శ..

397
kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగస్టు 14న వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారానికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి ఈ నెల 4న అనారోగ్యంతో మృతి చెందగా, బుధవారం దశదినకర్మ కార్యక్రమానికి సీఎం హాజరై ఎమ్మెల్యేను పరామర్శించనున్నారు.

వరంగల్ వెళ్లే ముందు పెద్దపెల్లి జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరై అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ప్రగతి సింగారానికి రానున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ ఎం.హరిత, సీపీ డాక్టర్ విశ్వనాథ రవీందర్ సీఎం పర్యటనకు ఏర్పాట్ల చేయిస్తున్నారు.