ప్రముఖపుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొమ్మిదోసారి యాదాద్రికి చేరుకున్న కేసీఆర్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. పర్యటనలో భాగంగా టీఆర్ఎస్వీ నేత తుంగబాలు వివాహానికి హాజరైన సీఎం వధువరులను ఆశీర్వదించారు.
కొండపై నిర్మాణమవుతున్న ముఖమండపం మొదటి అంతస్తులో కాకతీయ స్తంభాన్ని అమర్చే పనులను పూజలు చేసి ప్రారంభిస్తారు. గుట్టపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.. గర్భగుడి చుట్టూ ప్రధాన ఆలయ నిర్మాణంతోపాటు దానికి అనుబంధంగా ఉండే క్యూకాంప్లెక్సులు, వసతిగృహాల నిర్మాణాలు, మంచినీటి సరఫరా వ్యవస్థ, సుందరీకరణ పనులపై అధికారులతో సమీక్షిస్తారు. 2018 బ్రహోత్సవాలనాటికి ఆలయపనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి.