సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ విస్తృత స్ధాయి సమావేశం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరగనుండగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులలు హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగం పక్షాన చేయాల్సిన పోరాటాలు, నిరసనలపై పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. యాసంగి ధాన్యాన్ని వందశాతం కేంద్రం ప్రభుత్వం సేకరించేలా ఒత్తిడిచేసేందుకు చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అటు పార్లమెంట్‌లో కూడా ఏం చేయాలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
రైతులతో కోటి సంతకాలు సేకరించాలన్న యోచనలో ఉంది టీఆర్ఎస్. టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత మంత్రులు, ఎంపీలతో కలిసి సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు .