6వ విడతహరితహారం…ఇంటికీ ఆరు మొక్కలు

312
haritha haram
- Advertisement -

తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమం హరితహారం. ఇప్పటివరకు ఐదు విడతల హరితహారం కార్యక్రమాన్ని ముగించుకుని నేడు ఆరో విడత హరితహారం కార్యక్రమానికి సిద్ధమైంది.

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ నిరాడంబరంగా 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గతంలో భారీ సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి పరిమిత సంఖ్యలో మాత్రమే పాల్గొననున్నారు. ఈ నెల 25 నుంచి ఆగష్టు 15 వరకు ఆరో విడత హరితహారం కార్యక్రమం జరగనుంది.

6వ విడత హరిత హారంలో భాగంగా రాష్ట్రంలో 30 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను ఉచితంగా అందిచనున్నారు. గతంలో గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువగా మొక్కలు నాటగా.. ఈసారి అడవుల్లో ఎక్కువ మొక్కలు నాటే ప్రణాళికలు రూపొందించారు.హరితహారం కోసం రాష్ట్రంలోని 12,500 నర్సరీల్లో మొక్కలు రెడీగా ఉన్నాయి.

గత ఐదేళ్లలో ప్రభుత్వం 177 కోట్ల మొక్కలను నాటారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచడంతో పాటు తెలంగాణలో అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడం కోసం కేసీఆర్ సర్కారు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

- Advertisement -