జులైలో హరితహారం.. తేదీలు ఖరారు చేయనున్న సీఎం కేసీఆర్..

791
- Advertisement -

రాష్ట్రంలో వర్షాలు ఊపందుకోగానే హరితహారం కార్యక్రమనిర్వహణకు సన్నద్ధం అవుతున్నది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి జులైలోనే హరితహారం కార్యక్రమం ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.ఈమేరకు సీఎం కేసీఆర్ త్వరలో తేదీలు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరు విడతల్లో తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఏడో విడతకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.

తెలంగాణకు హరితహారం..

తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

– మొదటి విడత హరిత హారం 2015 జులై 3న చిలుకూరులో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తొలి ఏడాది 15.96 కోట్ల మొక్కలు నాటారు.
– రెండో విడతను 2016 జులైన 8న చిట్యాలలో ప్రారంభించారు. రెండో విడత హరితహారాన్ని నల్లగొండ జిల్లా గుండ్రంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించటం జరిగింది. ఆ దఫాలో 31.67 కోట్ల మొక్కలు నాటారు.
– మూడో విడతను 2017 జులైలో కరీంనగర్‌లో ప్రారంభించారు. 34 కోట్లకుపైగా మొక్కలు నాటారు. మూడో విడత హరితహారాన్ని కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు డ్యామ్ వద్ద మొక్క నాటి ప్రారంభిచటం జరిగింది.
– 2018 ఆగస్టు 1న మెదక్ జిల్లాలోని గజ్వేల్‌లో నాలుగో విడత హరిత హారం ప్రారంభం కాగా.. 32 కోట్ల మొక్కలు నాటారు.
– ఐదో విడతను కూడా గజ్వేల్‌లోనే ప్రారంభించగా 38 కోట్ల మొక్కలు నాటారు.
– ఆరో విడత హరితహారం కార్యక్రమం 2020, జూన్ 25న మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌ గ్రామంలో ముఖ్యమంత్రి కెసీఆర్ అల్లనేరేడు మొక్కను నాటి ప్రారంభించాడు. ఈ విడత హరితహారం కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

- Advertisement -