మల్లన్న సాగర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..

64
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే నలుగురోజుల్లో పలు కీలక కార్యక్రమల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 18న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. 20వ తేదీన.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ముంబై వెళ్లనున్నారు. అలాగే 21న నారాయణ ఖేడ్‌లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-4లో భాగంగా రూ. 6,805 కోట్ల బడ్జెట్‌తో, 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన, తెలంగాణ జలకిరీటంగా భాసిల్లే మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ఈ నెల 23న ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

- Advertisement -