సీఎం కేసీఆర్ నామినేషన్‌కు ముహుర్తం ఫిక్సైంది. ఇవాళ గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకం చేసి అనంతరం 2.45 గంటలకు గజ్వేల్ ఆర్డీవో ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, సంగాపూర్ రోడ్‌లోని మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసిఆర్ ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంత్రి కేటీఆర్ ఈ నెల 19న నామినేషన్ వేయనున్నారు.
టీఆర్ఎస్ ఎన్నికల తుది మేనిఫెస్టోపై సమీక్ష నిర్వహించారు కేసీఆర్. రెండు రోజుల్లో ఎన్నికల ప్రణాళికను ప్రకటించనుండగా మిగిలిన టీఆర్ఎస్ అభ్యర్థులు 12 మంది జాబితాను త్వరలో ప్రకటించనున్నారు.
19 వ తేదీ నామినేషన్లు వేయటానికి చివరి తేది కావడంతో బీ ఫారాల అందజేతతో పాటు అభ్యర్ధులు ఎన్నికలలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.