మునుగోడు ప్రజా దీవెన సభ…

183
kcr cm
- Advertisement -

త్వరలో మునుగోడులో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రజా దీవెన సభ నిర్వహించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు జరిగే మునుగోడు ప్రజా దీవెన సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

60 యేండ్లు కాంగ్రెస్‌, బీజేపీలు పెంచి పోషించిన ఫ్లోరైడ్‌ రక్కసి నుంచి ఆరేండ్లలోనే మునుగోడుకు విముక్తి కల్పించి నేడు ప్రజా దీవెన సభకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా బీజేపీపై జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను చీకట్లోకి నెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. పేదలకు అందించే సబ్సిడీలను ఎత్తివేసేందుకు కేంద్ర బీజేపీ రూట్ మ్యాప్ సిద్ధం చేసిందన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలన్నదే ప్రధాని మోడీ పాలసీ అని..తెలంగాణలో నిరంతరాయంగా విరజిమ్ముతున్న విద్యుత్తు కాంతులను ఆర్పివేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రజలకు మంచి చేయాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు.

- Advertisement -