మేడారంకు సీఎం కేసీఆర్..

60
- Advertisement -

సీఎం కేసీఆర్‌ నేడు మేడారంలో పర్యటించనున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను ముఖ్యమంత్రి దర్శించుకుంటారు. సీఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు మేడారం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంటారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మేడారం జనసంద్రంగా మారింది. గద్దెల వద్దకు దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రేపటితో జాతర ముగియనుంది.మేడారం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా 34 పార్కింగ్ ప్లేస్ లను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడా ఏ సమస్య రాకుండా చూసేందుకు జాతరలో మొత్తం 40 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు.

గతంలో 3,300 బస్సులను జాతరకు నడపగా.. ఈసారి మరో 500 పెంచామని, మొత్తం 3800 బస్సులు నడపనున్నామని చెప్పారు మంత్రి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి. ఆర్టీసీలో ప్రయాణించే భక్తులు మాత్రమే సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెలకు సమీపంలో దిగుతారని చెప్పారు.

- Advertisement -