నేటి నుంచి రంగంలోకి గులాబీ బాస్..ప్రతిపక్షాలకు ముచ్చెమటలు

208
kcr
- Advertisement -

తెలంగాణలో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఉపందుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచార జోరుగా సాగుతుంది. ఇక గులాబీ బాస్ సీఎం కేసీఆర్ కుడా నేటి నుంచి రంగంలోకి దిగనున్నారు. కొద్ది రోజుల క్రితం కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బహిరంగసభల్లో పాల్గోన్న విషయం తెలిసిందే. నేటి నుంచి సీఎం కేసీఆర్ మలి విడత ప్రచారం ప్రారంభంకానుంది. ఇవాళ్లి నుంచి ఎప్రిల్ 4వ తేది వరకూ 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు నల్గొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడలో జరిగే బహిరంగ సభలో పాల్గోననున్నారు. అనంతరం సాయంత్ర 5.30గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గోంటారు. ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు మల్కాజ్ గిరి, సికింద్రబాద్, చేవెళ్ల నియోజకవర్గాల ప్రజలు పాల్గోననున్నారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును కూడా పూర్తి చేశారు నేతలు. ప్రతి సభకు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు జన సమీకరణ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్దులు, ఆయా జిల్లాల మంత్రలు, ఎమ్మెల్యేలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం అందరిని ఆకట్టుకో్నుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలు, ఫెడరల్ ఫ్రంట్ పలు అంశాలపై సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారని తెలుస్తుంది.

- Advertisement -