యాదవుల అభివృద్దే..తెలంగాణ అభివృద్ధి..

217
cm kcr speech kondapaka
- Advertisement -

గ్రామీణ తెలంగాణకు జవసత్వాలు తెచ్చి, గ్రామాల్లోనే వేల కోట్ల సంపదను సృష్టించాలన్న మహోన్నత లక్ష్యంతో నేడు గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. గొల్ల, కుర్మ, యాదవ కుటుంబాలకు జీవనోపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా చేయూతనందించేందుకు చేపట్టిన గొర్రెల పెంపకం పథకాన్ని రుమాలు, గొంగడి ధరించిన అనంతరం ఒగ్గుడోలు వాయించి ప్రారంభించారు సీఎం కేసీఆర్. దాదాపు కొటిన్నర గొర్రెలపంపిణీకి శ్రీకారం చుట్టారు. తెలంగాణ యాదవుల అభివృద్దికి కొండపాక నుంచి అడుగులు మొదలయ్యాయన్నారు కేసీఆర్‌.

CM KCR Launches Sheep Distribution Scheme

తెలంగాణ యాదవులు ఆయన దృష్టిలో గొప్ప సంపద అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కొండపాకలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం ప్రసంగించారు. మూడేళ్ల తర్వాత ఇండియాలో అత్యంత ధనవంతమైన గొల్లకురుమలు తెలంగాణలో ఉన్నారని చెప్పుకుంటామని తెలిపారు. రాబోయే మూడేళ్లలో రూ. 25 వేల కోట్ల సంపదను గొల్లకురుమలు సృష్టించబోతున్నారని చెప్పారు. 1948-56 మధ్య కాలంలో తెలంగాణ ధనిక రాష్ట్రమని నాడు వేల ఉద్యమ సభల్లో చెప్పానని గుర్తు చేశారు.

నాడు తాను చెప్పింది.. నేడు నిజమైందన్నారు. ఆర్థిక ప్రగతిలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని స్పష్టం చేశారు. గ్రామసీమల్లోనే నైపుణ్యం కలిగిన మానవ వనరులున్నాయన్నారు. మానవ సంపదను కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. 2020 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ. 5 లక్షల కోట్లు ఉంటుందని ఉద్ఘాటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడమే లక్ష్యమని తేల్చిచెప్పారు.

- Advertisement -