మిషన్‌ భగీరథ పథకాన్ని యావత్‌ దేశం ప్రసంశించింది

419
cmkcr
- Advertisement -

మిషన్‌ భగీరథ పథకాన్ని యావత్‌ దేశం ప్రసంశించింది అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశామన్నారు. మిషన్‌ భగీరథపై అన్ని వివరాలు తీసుకొని సభకు వచ్చి మాట్లాడుతుంటే కాంగ్రెస్‌ నాయకులు పారిపోయారు. సభలో పిచ్చికూతలు కూసినా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి నియోజకవర్గంలో 334 ఆవాసాలకు నీళ్లు ఇస్తున్నామని తెలిపారు.

మిషన్‌ భగీరథ పథకాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి మనం మాట్లాడే మాటలు వినలేకనే.. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పారిపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి రోజు రోజుకు దిగజారుతోంది. ఒక్క తెలంగాణలోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్ధితి ఇలానే ఉందన్ననారు. ఇటివలే జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4శాతం ఓట్లకు పరిమితమైందని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే చక్కగా గెలిచినట్టు.. మేము గెలిస్తే పైసలిచ్చి గెలిచినట్టా? అని సీఎం ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మంచి జరిగినా, చెడు జరిగినా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల దయతోనే మనం అధికారంలో ఉంటామని సీఎం స్పష్టం చేశారు. ఇంధిరా గాంధీ, ఎన్టీఆర్ లాంటి మహానేతలు కూడా సామాన్యుల చేతిలో ఓటమిపాలయినట్లు గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో 63 స్థానాలను గెలుచుకున్నాం. 2018 ఎన్నికల్లో 88 స్థానాలను గెలుచుకునే సరికి కాంగ్రెస్‌కు మతి పోయిందన్నారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 32 జెడ్పీ చైర్మన్లను టీఆర్ఎస్ గెలుచుకున్నట్లు తెలిపారు.

- Advertisement -