CM KCR:కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యం

39
- Advertisement -

దేశంలో మూత పడిన ఏ పరిశ్రమను తెరవలేదని కానీ ఇక్కడ పేపర్ మిల్లును తెరిపించారన్నారు సీఎం కేసీఆర్. సిర్పూర్ కాగజ్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం..రైతుల కోసమే ధరణి పోర్టల్ తెచ్చామన్నారు.తెలంగాణ హక్కుల కోసం పోరాడే ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అన్నారు. సిర్పూర్‌లో 16 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చామన్నారు. ధరణి తీసేసి మళ్లీ దళారుల రాజ్యం తేవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు.

బీఆర్ఎస్‌ను చీల్చే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు సీఎం కేసీఆర్. చావునొట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని గుర్తు చేశారు. ఎన్నికలు వస్తాయి పోతాయి కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలన్నారు. బీఆర్ఎస్ ఏం చేసిందో మీ కండ్ల ముందే ఉందన్నారు. ఉచిత విద్యుత్, సాగు నీరు అందించామన్నారు. సిర్పూర్‌కు పాత వైభవం తీసుకొస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ మంచి నీళ్లు అందుతున్నాయన్నారు. పేదలకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నాం అని చెప్పారు.ధరణి, రైతు బంధు తీసేస్తామంటున్న కాంగ్రెస్ నేతలకు తగిన బుద్ది చెప్పాలన్నారు. కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యం రావడం ఖాయమన్నారు.

కొనేరు కొనప్ప ప్రజల మనిషి అన్నారు. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేల్లో ప్రజల కోసం పనిచేసే అతికొద్దిమందిలో కొనప్ప ఒకడన్నారు.అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి కొనేరు కొనప్ప అన్నారు. ఏ ఆపద వచ్చిన నేనున్నా అని ముందుండే మంచి మనిషి అన్నారు. బీఆర్ఎస్ గెలిచే స్థానాల్లో నెంబర్ 1 స్థానం కాగజ్‌నగర్ అన్నారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే కొనప్ప గెలుపు ఖాయమైందన్నారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్‌కు ఓటేయాలన్నారు.

Also Read:డీప్‌‌ఫేక్‌.. హీరోయిన్లే కాదు.. అందరూ!

- Advertisement -