తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి? ఆలోచించాలన్నారు సీఎం కేసీఆర్. షాద్‌నగర్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇవాళ 157 మెడికల్ కాలేజీ పెట్టింది. ఒక్కటంటే ఒక్కటి తెలంగాణకు ఇవ్వలేదు అన్నారు. వంద ఉత్తరాలు రాసినా ఇవ్వలేదు. నవోదయ పాఠశాల జిల్లాకు ఒకటి ఇవ్వాలని పార్లమెంట్‌లో చట్టం ఉన్నది. మోదీకి వంద ఉత్తరాలు రాస్తే ఒక్కటంటే ఒక్కటి నవోదయ పాఠశాల ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీ పార్టీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి? బీజేపోడికి ఓటు వేస్తే మోర్లె పాడేసినట్లవుతుంది అని సీఎం కేసీఆర్ అన్నారు.
ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అన్నారు. 15 ఏండ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నం…. కాంగ్రెస్ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏండ్లు పాలించింది. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపింది వాస్తవం కాదా అన్నారు. దాంతో 58 ఏండ్లు మనం పడరాని పాట్లు పడ్డం. ఆఖరికి జగమొండిగా ఉండి 33 పార్టీల మద్దతు సాధించి, ఆమరణ దీక్షకు కూసుంటే, సమ్మెలు చేస్తే దిగొచ్చి రాష్ట్రం ఇచ్చారన్నారు.
పదేళ్లుగా బీఆర్‌ఎస్ అధికారంలో ఉంది… అంతకుముందు 50 ఏండ్లు కాంగ్రెస్ ఉన్నది. గతంలో ఎవరు ఏం చేసిండ్రో, ఏ పార్టీ సర్కారు ఏం చేసిందో ఆలోచించి ఓటేస్తెనే మంచి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ మళ్లీ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారని..ఇందిరమ్మ రాజ్యంలో ఎన్ని అరాచకాలు జరిగాయో ఆలోచించాలన్నారు. ఎవరికి కావాలి ఇందిరమ్మ రాజ్యం ఆలోచించాలన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలిప్పిస్తామని తెలిపారు. రైతు బంధును ఆపి కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందని…కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచించాలన్నారు. రైతు నోటికాడ బుక్కను ఎగ్గొట్టిందన్నారు.
Also Read:రెగ్యులర్ షూటింగ్‌లో వరుణ్..మట్కా!