వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రతీక పీవీ: సీఎం కేసీఆర్

301
cm kcr
- Advertisement -

వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రతీక పీవీ….ఆయన మాట్లాడితే సరస్వతి నాట్యం చేసినట్లే ఉంటుందన్నారు సీఎం కేసీఆర్. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం…360 డిగ్రీల పర్సనాలిటీ పీవీ నరసింహారావు అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మాటలు సరిపోవన్నారు.

దేశంలో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని…పీవీ సంస్కరణ శీలి అన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి….ప్రొడక్ట్ ఆఫ్ పీవీ నరిసింహరావు అన్నారు.విద్యాశాఖ మంత్రిగా ఎంతోమంది మేధావులను రాష్ట్రానికి అందించారని చెప్పారు. గురుకుల పాఠశాలను తీసుకొచ్చారని చెప్పారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. తెలుగు అకాడమీకి పీవీ పేరుని పరిశీలిస్తామన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ యూనివర్సిటీ పేరు మార్చాలని సూచించారని దీనిపై వెంటనే కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు సీఎం.

దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలకు శ్రీకారం చుట్టిన గొప్ప వ్యక్తి అన్నారు. జైళ్ల శాఖ అప్పజెప్పితే ఓపెన్ జైల్ కాన్సెప్ట్ తీసుకొచ్చారని చెప్పారు. పీవీది అద్భుతమైన వ్యక్తిత్వం అన్నారు. నిన్నటి గతమే నేడు ఓ చరిత్ర అన్న సీఎం…..పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

తాను చెప్పదలుచుకున్న దానిని సూటిగా,స్పష్టంగా చెప్పిన గొప్పవ్యక్తి పీవీ అన్నారు. పీవీ దేశానికే గొప్ప సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. విదేశాంగ శాఖ మంత్రిగా లుక్ లీడ్స్ అనే కొత్త ఫిలాసఫీని తీసుకొచ్చారన్నారు.

ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అన్నారు. భూస్వామిగా వేల ఎకరాలు ఉంటే తనకు 150 ఎకరాలు ఉంచుకుని మిగితా భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అందుకే పీవీ మన ఠీవీ అన్నారు.

గెలుపులో ఓటములో తాను అనుకున్నది చేసిన వ్యక్తి అన్నారు. ప్రధానమంత్రిగా ఆ పదవికే వన్నె తెచ్చిన గొప్పవ్యక్తి అన్నారు. దేశాన్ని ఆర్ధిక మాంద్యం నుండి గట్టెక్కించిన మహానీయుడన్నారు. అయితే పీవీకి లభించాల్సిన గుర్తింపు దక్కలేదన్నారు.

పీవీ గొప్ప విద్యార్ధి అని అందుకు వయస్సుతో నిమిత్తం లేకుండా 17 భాషలను నేర్చుకున్నారని చెప్పారు. ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన మేధావి…అభ్యుదయ వాది, గొప్ప ధీరుడు పీవీ అన్నారు.

తెలంగాణ భావితరాలకు మన చరిత్ర అందాలన్నారు. ఎమ్మెల్యే నుండి అంచెలంచెలుగా ప్రధానిగా ఎదిగారన్నారు. నవభారత నిర్మాతల్లో పీవీ ఒకరని…గ్లోబల్ ఇండియాని సృష్టించిన గొప్ప వ్యక్తి అన్నారు. నెహ్రుతో సమకాలీన వ్యక్తి పీవీ అని…51 దేశాల్లో పీవీ శతజయంతి వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ 33 జిల్లాల్లో పీవీ జయంతి వేడుకలు జరుగుతున్నాయన్నారు. రూ. 10 కోట్ల రూపాయలను పీవీ జయంతి వేడుకల కోసం విడుదల చేశామన్నారు.

- Advertisement -