ఆకుపచ్చ తెలంగాణే నా స్వప్నం:కేసీఆర్

267
kcr
- Advertisement -

ఆకుపచ్చ తెలంగాణే నా స్వప్నం అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్..అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్‌ని గెలిపించాలన్నారు. కోటి ఎకరాలకు నీరందించడమే నా లక్ష్యమన్నారు. తెలంగాణ గెలిచి నిలవాలన్నారు.తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చల్లిన విత్తనాలు పూతపూసి,కాయ కాసేందుకు వచ్చాయన్నారు. హరిత తెలంగాణ కోసం అహర్నిషలు కృషి చేశామన్నారు. దుఃఖం లేని తెలంగాణే నా స్వప్నం అన్నారు.టీఆర్ఎస్ గెలిస్తే కాళేశ్వరం…చంద్రబాబు కూటమి గెలిస్తే శనేశ్వరం ఏదికావాలో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎంతోమంది త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు
కృషిచేస్తున్నామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు కేసీఆర్. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు పన్నారని చెప్పారు. అసల్‌యాల్లకు ఫిసల్‌గయా అన్నట్లు చేయోద్దన్నారు.

కాంగ్రెస్,టీడీపీ రెండు కత్తులు మనముందుకు వస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలన్నారు. మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణను బానిస కానియ్య అని చెప్పారు. కూటమికి ఓటుతో బుద్దిచెప్పాలన్నారు. రైతులకు 20 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.

తెలంగాణ మేధావులు,రిటైర్డ్ ఉద్యోగులు,కవులు,కళాకారులు ఆలోచన చేయండి…రక్షణ కవచంగా నిలవాలన్నారు. ప్రజల మద్దతులేనిది ఏం చేయలేనని..ప్రజల మద్దతుతోని తెలంగాణ సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. రైతుల బ్రతుకులు మారాలని రైతు బంధు,రైతు భీమా తీసుకొచ్చామన్నారు. 25 లక్షల టన్నుల గోదాంలను నిర్మించామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు 24 గంటల కరెంట్ ఇస్తామని,రైతు బంధు పథకం ద్వాకా ఎకరాకు 10 వేల రూపాయలు ఇస్తామన్నారు. రైతుల అప్పులు తీరి బ్యాంకులో డబ్బులు నిల్వ ఉండే పరిస్థితి రావాలని అప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా సంక్షేమానికి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్‌ సర్కార్ అన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల భృతి అందిస్తామన్నారు. అమ్మ ఒడి వాహనం ద్వారా గర్భిణి స్త్రీలకు భరోసా కల్పించామన్నారు. ఒంటరి మహిళలకు ఫించన్,బీడీ కార్మికులకు ఫించన్‌ అందిస్తున్న ఘనత టీఆర్ఎస్‌కే దక్కిందన్నారు. పేదింటి అమ్మాయి పెళ్లికి సాయం అందించేందుకు కళ్యాణలక్ష్మీ పథకానికి శ్రీకారం చుట్టామని ప్రస్తుతం లక్షా 116 రూపాయలను అందిస్తున్నామని చెప్పారు.

పంచాయతీ ఎన్నికలు కూడా నెలరోజుల్లో జరుగుతాయన్న కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలను చేసుకున్నామని చెప్పారు. బోగస్ సర్వేలను విశ్వసించవద్దని…టీఆర్ఎస్ వంద సీట్లకు పైగా సాధిస్తుందని చెప్పారు. గజ్వేల్ లో ఇళ్లు లేని పేదవారు ఉండవద్దన్నారు.

- Advertisement -