బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అన్నారు సీఎం కేసీఆర్. నిజామాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తాకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు సీఎం కేసీఆర్. ఓటు ప్రజల తలరాతను నిర్ణయిస్తుందని ఆషామాషీగా ఓటు వేయ వద్దన్నారు.
మరోసారి బీఆర్ఎస్ సర్కార్ వస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ గంగా జమునా తెహజిబ్ అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాతే నిజాం సాగర్‌కు పూర్వ వైభవం వచ్చిందన్నారు. దేశంలో సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ అన్నారు. గణేష్ గుప్తాను గెలిపిస్తే నిజామాబాద్‌కు మంచి జరుగుతుందన్నారు. తలసారి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ అన్నారు.
కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్దిని ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ఓ సారి పరిశీలించి ఓటు వేయాలన్నారు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని తెలిపారు. హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరం కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నామన్నారు.బీఆర్ఎస్ చరిత్ర ఏంటో ప్రజల ముందే ఉందన్నారు. పొరపాటున కాంగ్రెస్ వస్తే రాష్ట్రం ఆగమవడం ఖాయమన్నారు.బీజేపీ మత చిచ్చుతో మంటలు పెట్టే పార్టీ అన్నారు. బీజేపీ తెలంగాణను అడుగడుగునా మోసం చేసిందన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి మరి తెలంగాణకు అన్యాయం చేశారన్నారు.
కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పారని కానీ ఆ పనిచేయలేదన్నారు. మోటార్లకు మీటర్ పెట్టనందుకు రూ.25 వేల కోట్లు ఎగనామం పెట్టారన్నారు. రాయి ఏదో రత్నం ఏదో తెలుసుకుని ఓటేయాలన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలన్నారు.
Also Read:రవి పొలిశెట్టి…’సౌండ్ పార్టి’

