KCR:ప్రజల చేతిలో వజ్రాయుధం ఓటు

55
- Advertisement -

ప్రజల చేతిలో వజ్రాయుధం ఓటు అన్నారు సీఎం కేసీఆర్. నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం…నిర్మల్ జిల్లా చేసుకున్నం,మెడికల్ కాలేజీ ప్రారంభించుకున్నామని తెలిపారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందన్నారు.

దేశంలో రైతు బంధు పథకాన్ని పుట్టించిందే సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సభను చూస్తే ఇంద్రకరణ్ రెడ్డి గెలుపు ఖాయమైందన్నారు. పదేళ్లలో రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదన్నారు. నిర్మల్ అభివృద్ధికి ఇంద్రకరణ్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. రూ.714 కోట్లతో లక్ష్మీనరసింహ ప్రాజెక్టును కట్టామన్నారు. నిర్మల్ అభివృద్ది కోసం నిరంతరం తాపత్రయ పడేవారు ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

ఇంద్రకరణ్ రెడ్డి సౌమ్యుడు, అందరివాడు అన్నారు.గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయన్నారు. దళిత సమాజాన్ని ఉద్దరించాలనే దళిత బంధు తీసుకొచ్చామని తెలిపారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా చేశామని…అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. రైతుల భూములు క్షేమంగా ఉండాలని ధరణి పోర్టల్ తెచ్చామన్నారు.పోడు భూములకు పట్టాలిచ్చి కేసులు ఎత్తివేసి రైతు బంధు కూడా ఇచ్చామని చెప్పారు.తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చాక పరిస్థితులు ఎంతగా మారాయో అర్ధం చేసుకోవాలన్నారు.

Also Read:KTR:టాలెంట్‌ ఉంటే ఏదైనా సాధించొచ్చు

- Advertisement -