సంగారెడ్డి ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నారాయణఖేడ్‌లో సంగమేశ్వర – బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ప్రాంత సందర్శనకు వస్తే పది మంది కార్యకర్తలు ఉండేది. ప్రజల్లో పెద్ద ఆశ ఉండేది కాదు. కేసీఆర్ వస్తుండు పోతుండుగని వస్తదా తెలంగాణ అనే మాట ఎక్కువగా ఉండేది. వేరే పార్టీల వాళ్ళు కన్ఫ్యూజ్ చేసిది. భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత నారాయణఖేడ్‌కు జరుగుతున్న సేవ, హరీశ్‌రావు మంత్రిగా ఉండి భూపాల్‌రెడ్డిని గెలిపించిన సందర్భంలో ఇక్కడ చేసిన సేవ ఇన్ని రోజులైనా చిమ్నిబాయిని గుర్తుంచుకొని పిలిపించడం సంతోషంగా ఉంది.
సంగారెడ్డిలో గల్లీ గల్లీలో పాదయాత్రలు..
గతంలో రవాణా మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో తిరిగాను. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరు, ఆందోల్ పర్యటించాను. గల్లీ గల్లీలో పాదయాతలు కూడా చేశారు. అక్కడే వారం పది రోజులు ఉండి జిల్లా అధికారులు, కలెక్టర్లను వెంటపెట్టుకొని రేగుడు, రాయికోడు, కంగ్టి, న్యాల్కల్ మండలాలు వరుస పెట్టి తిరిగాం. కొన్ని కొన్ని పనులు చేయగలిగాం. చాలా విచిత్రమైన పరిస్థితి ఉండేది. బుగ్గరామన్న చెరువు, గంగ కత్వా చెరువు ఉండేది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడుకుల చెరువులు గందరగోళమైనప్పుడు లక్ష్మారెడ్డి, అప్పటి ఎమ్మెల్యే భాగన్న, గోవర్ధన్‌రెడ్డి తనను తీసుకెళ్లి.. ఇవన్నీ బాగు కావాలని ఎంతో కొంత ప్రయత్నం చేశాం. చాలా బాధ కలిగిలేది. అవని చూసి అవగాహన అయిన తర్వాత.. మొత్తం తెలంగాణ వెనుకబడేయిబడినట్లు ఉంది కాబట్టి.. తెలంగాణ రాష్ట్రం అయితే తప్ప ఇది బాగుపడది నిర్ణయానికి వచ్చి.. మీ అందరి దీవెన, సహకారంతో యుద్ధం చేశాం. 14 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత ఆమరణ దీక్ష పట్టి చావు అంచు వరకు పోతే అప్పుడు తెలంగాణ ఇస్తమని ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ మోసం జరిగింది. మళ్లీ అందరం కలిసి కొట్లాడం. సంగారెడ్డి, జహీరాబాద్, ఆంధోల్ ప్రాంతం కూడా ఉద్యమంలో ముందుకు ఉరిగింది. బ్రహ్మాండంగా పట్టుబట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నాం.
24గంటల కరెంటిచ్చే రాష్ట్రం తెలంగాణే..
తెలంగాణ ఏర్పడే ముందు ఎన్నో బద్నాంలు పెట్టారు. అపనమ్మకాలు కలిగించారు. మీకు కరెంటు రాదు.. చీకటి ఉంటది.. పరిశ్రమలు మొత్తం తరలిపోతయ్.. పరిపాలన చేతకు మీకు అని మాట్లాడింన్రు. ఎవరైనా ఈ మాటలు మాట్లాడారో వాళ్ల దగ్గర కరెంటు లేదు. మన తెలంగాణ ఇవాళ 24 గంటల కరెంటు ఉన్నది.. మీ అందరికీ తెలుసు. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చే రాష్ట్రం దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇదంతా మీరిచ్చిన బలం, మీ దీవెన బలం. కరెంటే కాదు, మంచినీళ్ల శాశ్వతంగా బాధ పోయింది. రూ.2వేల పింఛన్ ఇచ్చే రాష్ట్రం లేదు ఇండియాలో. ఇవాళ వృద్ధులంతా చాలా గౌరవంగా ఉన్నరు. కోడళ్లు మునుపు వాళ్లను సరిగా చూసుకోకపోయేది. ఇప్పుడు అత్తా రా.. అవ్వా రా అని తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో ఒక ధీమా వచ్చింది. పేదలకు ఇబ్బంది లేకుండా బియ్యం ఇచ్చేది పెంచుకున్నాం. పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. ఆడపిల్ల పెండ్లయితే లక్ష రూపాలు ఇచ్చుకుంటున్నం. చాలా మంచి కార్యక్రమాలు చేశాం. వ్యవసాయ రంగంలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయ్.
దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు భారీగా స్కాలర్‌షిప్..
విద్యార్థులు బయటకు వెళ్లి చదువుకోవాలంటే ఏ రాష్ట్రం సైతం రూ.20లక్షల స్కాలర్‌షిప్ ఇవ్వదు ఏ రాష్ట్రం ఇండియాలో. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు మీద, జ్యోతిరావుఫూలే పేరు మీద రూ.20లక్షల స్కాలర్‌షిప్ విద్యార్థులకు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒక్కో విద్యార్థిపై రూ.1.20లక్షల ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థులు బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, అంతర్జాతీయ స్థాయిలో పోటీపరీక్షల్లో ర్యాంకులు సాధిస్తున్నారు. అందరికీ ఇది గర్వకారణం. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్. అనేక రంగాల్లో నెంబర్‌వన్‌గా నిలబడ్డాం. మీ అందరి దీవెనలతో ముందుకెళ్తున్నాం.
నా చేతులతో ప్రాజెక్టులకు శంకుస్థాపన..
ఎంపీ బీబీపాటిల్ ఎన్నికల సమయంలో అల్లాదుర్గంలో పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆ రోజు మాట ఇచ్చాను. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావొస్తున్నది. సంగారెడ్డి జిల్లా అంధోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పాను. చాలా సంతోషంగా ఉంది. రూ.4వేలకోట్లతో నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టుకు నా చేతులతో శంకుస్థాపన చేశాను. మంత్రి హరీశ్‌రావు క్రియాశీలమైన మంత్రి. ప్రజల కోసం పనిచేయాలనే తపన ఉన్న మంత్రి. ఆయన జిల్లాలో ఉన్నందున చాలా మంచి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు అందరు కలిసి అధికారులు, కాంట్రాక్టర్ల వెంటపడి ఏడాదిన్నర లోపు ప్రాజెక్టు పనులు పూర్తి చేయించి.. అన్ని ప్రాంతాలకు నీరందేలా చూడాలని మంత్రి హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ సూచించారు.
బంగారు తెలంగాణను ఎలా తయారు చేసుకున్నామో.. బంగారు భారతదేశాన్ని కూడా తయారు చేసుకుందామన్నారు. నారాయణ్‌ఖేడ్‌లో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తానని తెలిపారు.
నేను జాతీయ రాజకీయాల్లో కూడా పోయి మాట్లాడుతున్నా. పని చేస్తా ఉన్నా. పోదామా మారి.. జాతీయ రాజకీయాల్లోకి. ఢిల్లీ దాక కొట్లాడుదామా? భారతదేశాన్ని బాగు చేద్దామా. ఎట్ల తెలంగాణను బాగు చేసుకున్నామో.. అదే పద్ధతిలో భారతదేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించాలి. తప్పుకుండా ఈ దేశాన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు చేయాలి. మనం అమెరికా పోవడం కాదు.. ఇతర దేశాలే వీసాలు తీసుకొని మన దేశానికి వచ్చే పరిస్థితి చేసేంత గొప్ప సంపద, వనరులు, యువశక్తి ఈ దేశంలో ఉన్నది. కాబట్టి నేను పోరాటానికి బయలుదేరా. బంగారు తెలంగాణను ఎలా తయారు చేసుకున్నామో.. బంగారు భారతదేశాన్ని కూడా తయారు చేసుకుందాం.. అని స్పష్టం చేశారు.
నిన్న మహారాష్ట్రలో సీఎం ఉద్ధవ్ థాకరే అడుగుతున్నరు. మీరు రైతు బంధు ఇస్తున్నారట. మీరు రైతు బీమా ఇస్తున్నారట. బార్డర్ వాళ్లు తెగ ఇబ్బంది పెడుతున్నరు. ఎట్లా ఇస్తున్నారో కాస్త చెప్పండి. మేము కూడా స్టార్ట్ చేస్తం అని అడిగారు. అందుకే.. తెలంగాణలో జరిగే పనులు దేశవ్యాప్తంగా జరగాలని దేశం కోరుతోంది. దేశం గురించి మనం కూడా కొట్లాడాలి. బంగారు తునక లాంటి తెలంగాణను చేసుకోవాలి.. అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.