KCR:నారాయణపేట పచ్చబడాలే

40
- Advertisement -

నారాయణ పేట ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం..సమైక్య పాలనలో పాలమూరు ఆగమైందన్నారు. ఉన్న తెలంగాణను ఆనాడు ఆంధ్రాలో కలిపింది ఇదే కాంగ్రెస్ వారన్నారు. ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా తెలంగాణను ఆంధ్రాలో కలిపారన్నారు. వలసలు, కరువుల చాలా భయంకరమైన పేదరికంతో ఇబ్బందులు పడ్డామన్నారు.

కానీ స్వరాష్ట్రంలో తెలంగాణ సగర్వంగా రెపరెపలాడిందన్నారు. అంతకముందు పెన్షన్లు ఎన్ని ఉండే ఇప్పుడు ఎంత ఉందో ఆలోచించాలన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దన్నారు. తెలంగాణ ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతున్న కొద్ది పెన్షన్లు పెంచుకుంటూ పోయామన్నారు. హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి మున్సిపాలిటీ నారాయణ పేట అన్నారు.

మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం ప్రజల ముందే ఉందన్నారు. ఎన్నికల్లో వ్యక్తితో పాటు పార్టీని చూసి ఓటు వేయాలన్నారు. దేశంలో దళితబంధును ప్రవేశ పెట్టిందే సీఎం కేసీఆర్ అన్నారు.స్వాతంత్య్రం వచ్చిన రోజే దళితుల గురించి కాంగ్రెస్ ఆలోచించి ఉంటే ఈ పరిస్ధితి వచ్చేది కాదన్నారు.ప్రతీ కుటుంబానికి దళిత బంధు వచ్చే వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. తెలంగాణ వచ్చాక నారాయణపేటను జిల్లా చేసుకున్నామన్నారు. పాలమూరు ఎత్తిపోథల పథకంపై అనేక కేసులు వేశారని ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నారాయణపేటకు నీళ్లు ఇచ్చే బాధ్యత తనదని…పచ్చటి పంట పొలాలతో కళకళలాడేటట్లు చేస్తామన్నారు. నారాయణపేటకు రింగు రోడ్డు మంజూరు చేస్తానని చెప్పారు. పాలమూరును గోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని…చాలా మంది ముఖ్యమంత్రులు దత్తత కూడా తీసుకున్నారని కానీ నీళ్లు కూడా ఇవ్వలేకపోయారన్నారు. తెలంగాణ వచ్చాక ఒక్కొ సమస్యను అధిగమిస్తూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామన్నారు.

Also Read:CM KCR:పేదల సంక్షేమమే మా ధ్యేయం

- Advertisement -