CM KCR:నకిరేకల్ అభివృద్ధి బాధ్యత నాదే

58
- Advertisement -

ప్రజాస్వామ్యంలో ఓటే ప్రజలకు వజ్రాయుధం అన్నారు సీఎం కేసీఆర్. నకిరేకల్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్..ఈ జిల్లా చైతన్యం గల్ల జిల్లా అన్నారు. ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద్దని…ఆలోచించి ఓటు వేయాలన్నారు. మంచి చేసే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తితో పాటు పార్టీని చూడాలన్నారు.

తెలంగాణ‌లో వ‌డ్లు ఎలా పండుతున్నాయో, ఇండ్ల నిర్మాణం కూడా వ‌చ్చే ఐదేండ్లలో అట్లానే జరుగుతుందన్నారు. మ‌నం ఏదైనా ప‌డితే గ‌ట్టిగ ప‌డుతం క‌దా.. ఇండ్ల జాగాలు లేనోళ్ల‌కు జాగాలు ఇస్తాం.. సొంత జాగ ఉన్నోళ్ల‌కు డ‌బ్బులు ఇస్తాం.. ఇల్లు లేని మ‌నిషి లేకుండా చేసుకుందాం. ఒక‌టి త‌ర్వాత ఒక‌టి చేసుకుంటూ వెళ్దాం అన్నారు. ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్. ఫిట్‌నెస్‌ చార్జీలు రద్దు చేస్తామని ప్రకటించారు.

పల్లెల్లో పల్లె దవాఖానలు..బస్తీల్లో బస్తీ దవాఖానలు..జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టి పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. దేశంలో రైతు బంధును పుట్టించిందే సీఎం కేసీఆర్ అన్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో హరిగోస పడ్డామన్నారు. కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారు కాంగ్రెస్ వాళ్లు…ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఆకలి,వలసలు,ఎన్‌కౌంటర్లు ఆ దిక్కుమాలిన పాలన మళ్లీ కావాలా ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేసి భూమాత పథకాన్ని తీసుకొస్తున్నారని…అది భూమాత కాదు భూమేత అన్నారు.

Also Read:Harishrao:బీజేపీకి ఓటు వేస్తే మోరిలో వేసినట్లే

- Advertisement -