కరోనా నేర్పిన పాఠంతో దేశంలో వైద్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీతో తెలిపారు సీఎం కేసీఆర్. 9 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్….కేంద్ర,రాష్ట్రాలు కలిసి వైద్యరంగంపై ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
భవిష్యత్తులో కరోనా లాంటి విపత్కర పరిస్ధితులు వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించే విషయంపై దృష్టిపెట్టాలన్నారు. గతంలో కూడా అనేక వైరస్ లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. కరోనా వైరస్ లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఇది దేశానికి మంచి చేసే చర్య. కరోనా లాంటివి భవిష్యత్తులో ఏమి వచ్చినా సరే తట్టుకుని నిలబడే విధంగా వైద్య రంగం తయారు కావాలన్నారు. దీనికోసం ప్రధాన మంత్రి చొరవ సుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో రికవరీ రేటు 71 శాతం ఉంది. మరణాలు రేటు 0.7 శాతం ఉందని తెలిపారు సీఎం. కరోనా టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచాం. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం అన్నారు