ఒకరు చోర్.. ఇంకొకరు బడా చోర్-కేసీఆర్‌

274
CM KCR
- Advertisement -

సీఎం కేసీఆర్ అల్లాదుర్గంలో జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సభ పూర్తయిన అనంతరం నర్సాపూర్‌లో మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజారిటీతో మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారని స్పష్టం చేశారు. మెదక్‌లో 10 కి 9 స్థానాలు గెలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 88 సీట్లు ఇచ్చి టీఆర్‌ఎస్‌కు అధికారమిచ్చారని సీఎం తెలిపారు.

నేను కూడా ఈ మట్టిలో పుట్టిన బిడ్డనే. మీ బిడ్డనే. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య సాగునీరు, తాగునీరు, కరెంట్. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరం నీళ్లు మనకు రాబోతున్నాయి. అవి వస్తే జిల్లాలో అద్భుతం జరగబోతోంది. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, సింగూరు ప్రాజెక్టులన్నీ కాళేశ్వరం నీళ్లతో నిండుతాయి. దేశంలో ఏ నాయకుడు రైతుల గురించి పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

అనుకున్న స్థాయిలో దేశం బాగుపడటం లేదు. ఈ దేశంలో మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం రావాలె. కాంగ్రెస్, బీజేపీ ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఒకరు చోర్ అంటే ఇంకొకరు బడా చోర్ అంటరు. నరేంద్రమోదీపై కూడా ప్రజలకు చాలా ఆశ ఉండే. కానీ ఆయన కూడా ఎం చేయాలేదు.

గత ఐదేళ్లు సంపూర్ణమైన మెజార్టీతో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మాకు తెలంగాణ ప్రజలే బాసులు. వాళ్ల అవసరాలే మా ఎజెండా అని సీఎం కేసీఆర్ అన్నారు. డీల్లీలో మన మాట వినిపించాలంటే వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల్లో గెలిపించాలని కోరారు.

- Advertisement -