మేధావులు క‌ర‌దీపిక‌లుగా మారాలి..

68
cm kcr
- Advertisement -

75 ఏండ్ల స్వాతంత్ర్య ఫలాలను భారత ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ… నాటి అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. “స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం” ముగింపు వేడుకలు హైదరాబాద్ ఎల్‌.బీ. స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టేడియం వద్దకు సీఎం కేసీఆర్ గారు రాగానే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్టేడియంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ ముగింపు వేడుకల్లో శాసన మండలి చైర్మన్, శాసన సభ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు, వేలాదిగా ఆహుతులు హాజరయ్యారు.

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్త‌యిన‌ప్ప‌టికీ.. పేద‌ల ఆశ‌లు నెర‌వేర‌లేదు.. అనేక వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ‌కు స్వ‌తంత్ర‌ ఫ‌లాలు సంపూర్ణంగా అంద‌ట్లేద‌నే ఆవేద‌న మ‌న‌కు క‌న‌బ‌డుతుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వాట‌న్నింటిని విస్మ‌రించి ఈ దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుటిల ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డాన్ని మ‌నమంతా చూస్తున్నాం. మౌనం వ‌హించ‌డం స‌రికాదు. అర్థమైన త‌ర్వాత కూడా అర్థం కాన‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌డం మేధావుల ల‌క్ష‌ణం కాదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు క‌ర‌దీపిక‌లుగా మారి ఏ స‌మాజాన్ని అయితే స‌క్ర‌మ‌మైన మార్గంలో న‌డిపిస్తారో ఆ స‌మాజం గొప్ప‌గా పురోగ‌మించే అవ‌కాశం ఉంటుంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ‌న దేశంలో మ‌న రాష్ట్రానిది ఒక ప్ర‌త్యేక‌మైన స్థానం. స్వ‌తంత్ర భార‌త స్ఫూర్తిని ఈ త‌రం పిల్ల‌ల‌కు, యువ‌కుల‌కు తెలియ‌ని వారికి విస్తృతంగా తెలియ‌ప‌ర‌చాల‌నే ఉద్దేశంతో ఈ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని సీఎం తెలిపారు. అన్నింటిని మించి ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో తాను చెప్పిన‌ట్లు విశ్వ‌జ‌నీన‌మైన సిద్ధాంతాన్ని, అహింసా వాదాన్ని, ఎంత‌టి శ‌క్తిశాలులైనా స‌రే శాంతియుత ఉద్య‌మాల‌తో జ‌యించొచ్చ‌ని ప్ర‌పంచ మాన‌వాళికి సందేశం ఇచ్చిన మ‌హ్మ‌త్ముడు పుట్టిన గ‌డ్డ మ‌న భార‌తావ‌ని. అటువంటి దేశంలో గాంధీ గురించి, ఆయ‌న యొక్క ఆచ‌ర‌ణ గురించి, స్వాతంత్య్ర‌ పోరాటంలో ఉజ్వ‌లంగా వారు నిర్వ‌హించిన పాత్ర గురించి ఈత‌రం పిల్ల‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ప్రాణ‌, ఆస్తి త్యాగాలు, అమూల్య‌మైన జీవితాలు త్యాగం చేస్తే, ఎన్నో బ‌లిదానాలు చేస్తే ఈ స్వాతంత్య్రం వ‌చ్చింది. స్వేచ్ఛా భార‌తంలో స్వేఛ్చా వాయువులు పీలుస్తున్నాం. 75 ఏండ్లుగా జ‌రుగుతున్న విష‌యాల‌ను మ‌రోసారి సింహ‌వ‌లోక‌నం చేసుకోని ముందుకు పురోగ‌మించాల్సిన‌టువంటి ప‌ద్ధతులను ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం అంద‌రికీ ఉంది. ఈ దేశాన్ని స్వేచ్ఛా వాయువుల‌తో ఉండే విధంగా.. స్వ‌తంత్ర దేశంగా మార్చేందుకు ఎంద‌రో మ‌హ‌నీయులు త్యాగాలు చేశారు. వారంద‌రికీ శిర‌సు వంచి విన‌మ్ర‌పూర్వ‌కంగా జోహార్లు ఆర్పిస్తున్నాను. ఘ‌న‌ నివాళుల‌ర్పిస్తున్నాన‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

పేద‌ల ఆశ‌లు నెర‌వేర‌డ‌టం లేదు. అడుగు వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో ఆక్రోశం ఇంకా వినిపిస్తుంది. అనేక వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ‌కు స్వ‌తంత్ర‌ ఫ‌లాలు సంపూర్ణంగా అంద‌ట్లేద‌ని ఆవేద‌న మ‌న‌కు క‌న‌బ‌డుతుంద‌ని కేసీఆర్ తెలిపారు. వాట‌న్నింటిని విస్మ‌రించి దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుటిల ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డాన్ని మ‌నమంతా చూస్తున్నాం. మౌనం వ‌హించ‌డం స‌రికాదు. అర్థమైన త‌ర్వాత కూడా అర్థం కాన‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌డం మేధావుల ల‌క్ష‌ణం కాదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు క‌ర‌దీపిక‌లుగా మారి ఏ స‌మాజాన్ని అయితే స‌క్ర‌మ‌మైన మార్గంలో న‌డిపిస్తారో ఆ స‌మాజం గొప్ప‌గా పురోగ‌మించే అవ‌కాశం ఉంట‌ది. అద్భుత‌మైన ప్ర‌కృతి సంప‌ద‌తో, ఖ‌నిజ సంప‌ద‌తో యుశ‌క్తితో, మాన‌వ‌సంప‌త్తితో ఉన్న ఈ దేశం పురోగ‌మించ‌డం లేదు. స్వాతంత్య్ర ఉద్య‌మ స్ఫూర్తితో ఉజ్వ‌ల‌మైన రీతిలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంది. ఈ క్ర‌మంలోనే ఒక్కో రోజు ఒక్కో కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకున్నాం. గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో స్వ‌తంత్ర ఉద్య‌మంపై చ‌ర్చ జ‌రిగింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

సామూహిక జాతీయ గీతాలాప‌న చేయాలంటే సుమారు కోటి మంది పాల్గొన్నారు. ఏక‌కాలంలో ఆల‌పించ‌డం తెలంగాణ రాష్ట్రానికి గ‌ర్వ‌కార‌ణం అని సీఎం పేర్కొన్నారు. మ‌హాత్ముడు విశ్వ‌మాన‌వుడు. కొంద‌రు అల్పులు నీచంగా మాట్లాడుతున్నారు. ఆయ‌న గొప్ప‌త‌నాన్ని యూఎన్‌వో ప్ర‌శంసించింది. అంత‌ర్జాతీయంగా ఏ దేశానికి వెళ్లిన ఇండియా అంటే యూ ఆర్ గ్రేట్ అని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తుంటూరు. గాంధీ గారి జీవిత విశేషాలు, విగ్ర‌హాలు.. విదేశాల్లో ఉన్నాయంటే భార‌త‌దేశానికి గ‌ర్వ‌కార‌ణం అని చెప్పారు.

గాంధీ సినిమాను 22 ల‌క్ష‌ల మంది పిల్ల‌లు చూశారంటే 10 శాతం మందికి స్ఫూర్తి క‌లిగిన కూడా ఈ దేశం బాగా పురోగ‌మించ‌డానికి వారి శ‌క్తిసామ‌ర్థ్యాలు వినియోగిస్తున్నార‌ని న‌మ్ముతున్నాను. ఇటువంటి స్ఫూర్తి ముందు కూడా కొన‌సాగాలి. గాంధీ మార్గంలో దేశం పురోగ‌మించాలి. అహింసా సిద్ధాంతాన్ని ఉప‌యోగించుకొని తెలంగాణ సాధించాం. ఏ విధంగా పురోగ‌మిస్తున్నామో మ‌న‌కు తెలుసు. చాలా గొప్ప‌గా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన అంద‌రికీ, అల‌రించిన క‌ళాకారుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నానని సీఎం కేసీఆర్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

- Advertisement -