KCR:అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించండి

34
- Advertisement -

అభివృద్ధి కొన‌సాగాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు సీఎం కేసీఆర్. బాల్కొండ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్…వ్య‌వ‌సాయ స్థీరిక‌ర‌ణ కోసం రైతుబంధు తెస్తే.. కేసీఆర్ ప‌నిలేక దుబారా చేస్తున్నాడ‌ని కాంగ్రెస్ నేత‌లు మాట్లాడుతున్నార‌ని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఎవ‌రు గెలిస్తే లాభ‌మో ఆలోచించాలి…. పొర‌పాటున కాంగ్రెస్ గెలిస్తే ఆగమాగం అవుతుందన్నారు. కాంగ్రెస్ వారికి రైతుబంధు ఇష్టం లేదు,క‌రెంట్ ఇచ్చుడు ఇస్టం లేదు, రైతుల ఖాతాలో డైరెక్ట్‌గా డ‌బ్బులు వేసుడు ఇష్టం లేదు అన్నారు.

కాంగ్రెస్ వస్తే మళ్లీ పైరవీకారుల రాజ్యమే వస్తుందన్నారు. కేసీఆర్ బిచ్చ‌మేస్తుండు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైతులు బిచ్చ‌గాళ్ల లాగా క‌న‌బ‌డుతున్నారా..? రైతులు పండించే పంట ఎంత‌..? అందులో ఆయ‌న తినేది ఎంత‌..? మిగ‌తాది అంతా దేశానికే క‌దా ఇచ్చేది. ఎక్క‌డ త‌క్కువ ఉంటే అక్క‌డ బియ్యం పోతాయి క‌దా అని కేసీఆర్ తెలిపారు.

ధ‌ర‌ణి ఉండాల‌ని, 24 గంట‌ల క‌రెంట్ కావాల‌ని ప్ర‌జ‌లు అంటున్నారని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. పార్టీల చ‌రిత్ర‌, న‌డ‌వ‌డి గురించి మీరు ఆలోచించాలి. గిరిజ‌న బిడ్డ‌లు ఉన్నారు. మా తండాలో మా రాజ్యం రావాల‌ని కొట్లాడారు. ఏ ప్ర‌భుత్వం కూడా చేయ‌లేదు. ప‌ట్టించుకోలేదు. కానీ మా గ‌వ‌ర్న‌మెంట్‌లో ఆదివాసీ గూడెల‌ను, గిరిజ‌న తండాల‌ను గ్రామ‌పంచాయ‌తీలుగా మార్చాం అన్నారు. బాల్కొండలో ప్రశాంత్ రెడ్డిని మరోసారి దీవించాలని కోరారు సీఎం.

Also Read:BJP:మూడో జాబితా రిలీజ్

- Advertisement -