సోషల్ మీడియాపై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్‌..

489
cm kcr social media
- Advertisement -

ప్రస్తుతం రాజకీయాల్లో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇక ఎన్నికల సీజన్‌ అంటే సోషల్ మీడియా ప్రభావం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాతో విజయాన్ని సొంతం చేసుకున్న పార్టీలెన్నో. అంతేగాదు ఎలాంటి సెన్సార్ లేకపోవడంతో తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు నెటిజన్లు.

ఇక ప్రస్తుత పరిస్ధితుల్లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండని పొలిటిషియన్లు,పార్టీలు లేవు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై కౌంటర్ ఎటాక్‌,ప్రభుత్వ పథకాలను క్షేత్రస్ధాయిలోకి తీసుకెళ్లడంలో గులాబీ శ్రేణులు సక్సెస్ అయ్యాయి.

అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అదే సోషల్ మీడియా వేదికగా వారికి గట్టి సమాధానం ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం సోషల్‌‌‌‌ వారియర్స్‌‌‌‌ను రెడీ చేసుకుంటోంది టీఆర్ఎస్‌. వారికి పోస్టింగ్‌‌‌‌ బై పోస్టింగ్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ ఇచ్చేలా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది.

ఇప్పటివరకు హైదరాబాద్‌‌‌‌ కేంద్రంగా పనిచేస్తున్న సోషల్‌‌‌‌ మీడియా టీం మాత్రమే ప్రభుత్వాన్ని, పార్టీని వివిధ సందర్భాల్లో ప్రొటెక్ట్‌‌‌‌ చేస్తూ వచ్చింది. ఇకపై ప్రతి నియోజకవర్గంలోనూ సోషల్‌‌‌‌ మీడియా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన సోషల్‌‌‌‌ మీడియా కార్యకర్తలకు తొలుత పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శిక్షణ ఇప్పించి వారి ద్వారా గ్రామాలు, వార్డుల్లోని పార్టీ కార్యకర్తలకు ట్రైనింగ్‌‌‌‌ ఇవ్వనున్నారు. పార్టీ, ప్రభుత్వం, నాయకులపై వస్తోన్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలో నిపుణులు సూచించనున్నారు.

- Advertisement -