ప్రచారంలో గులాబి దూకుడు..

463
ktr
- Advertisement -

ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు టీఆర్ఎస్ అభ్యర్థులు. దీంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ధీటుగా ఎదుర్కునేందుకు యువతే లక్ష్యంగా గులాబి దళం వ్యూహరచన చేసింది.

ఈ మేరకు టీఆర్ఎస్వీని ప్రచారంలోకి దింపి ఒక్కో గ్రామానికి ఒక్కో విద్యార్థి నాయకుడికి బాధ్యతలు అప్పగించారు నేతలు. ఓటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని యువ నాయకుడు మంత్రి కేటీఆర్ నేతలకు సూచించారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 100 మంది శిక్షణ పొందిన విద్యార్థి నేతలను పార్టీ రంగంలోకి దింపింది. ప్రతి గ్రామంలో 15 మందితో బృందాన్ని ఏర్పాటు చేసి, విద్యావ్యవస్థలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించనున్నారు. విద్యార్థుల కోసం మోడల్ స్కూళ్ల ఏర్పాటు, ఫీజు రీయింబర్స్ మెంట్, మెస్ చార్జీల పెంపు తదితర అశాలను వివరిస్తూ యూత్ తో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఆకట్టుకునే పనిలో బిజీ అయ్యారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ నేతలంతా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే.. ప్రజలంతా తాము టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషిచేస్తామని స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. పలు గ్రామాల ప్రజలు టీఆర్ఎస్ కే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు.

ఓ వైపు గులాబీ దండు ప్రచారంలో దూసుకుపోతుండగా విపక్షాల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. పొత్తులు,సీట్ల పంపకాలు తేలక కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు.

- Advertisement -