అభివృద్ధి పథంలో జగిత్యాల…:కేటీఆర్

219
- Advertisement -

పేదవారు ఆత్మగౌరవంతో బ్రతకాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లకు శ్రీకారం చుట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. జగిత్యాలలో రైతు బంధు పథకం అవగాహన సదస్సు పాల్గొన్న కేటీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలతో ముందుకుపోతున్నామని చెప్పారు. జగిత్యాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ జిల్లాను చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సిద్దిపేటకు ధీటుగా జగిత్యాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా అన్నిప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు కేటీఆర్. కరీనంగర్ నుంచి ఏ పని ప్రారంభించిన విజయవంతమవుతుందని సీఎం కేసీఆర్ నమ్మకమని తెలిపారు కేటీఆర్. హైదరాబాద్ తర్వాత జగిత్యాలలో పెద్దసంఖ్యలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. జగిత్యాల పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.జగిత్యాలలో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

CM KCR Special Focus for Jagtial Devlopment

రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ.8వేలు పెట్టుబడి అందిస్తున్నామని చెప్పారు కేటీఆర్. తెలంగాణ వస్తే కరెంట్ కోతలతో చీకటిగా మారుతుందని ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని కానీ అనతికాలంలోనే తెలంగాణ కరెంట్ కష్టాలను అధిగమించిందని తెలిపారు. ఆనాడు కరెంట్ కోసం ధర్నాలు జరిగితే నేడు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వద్దనే పరిస్ధితి వచ్చిందన్నారు.

డబుల్ ఇండ్లకోసం దళారులను నమ్మి మోసపోవద్దని కేటీఆర్ సూచించారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు. రైతు బంధు పథకం ఏరాష్ట్రంలోనూ లేదన్నారు. జగిత్యాలలో ఫ్రూట్ ఇండస్ట్రీని తీసుకొస్తామని చెప్పారు. స్ధానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషిచేస్తామన్నారు.

CM KCR Special Focus for Jagtial Devlopment

- Advertisement -