విద్యుత్ కొరత అధిగమించాం…

201
CM KCR speaks about Power Issue on Assembly
- Advertisement -

తెలంగాణలో ప్రస్తుతం విద్యుత్ కొరత లేదని, టీఆర్‌ఎస్ ప్రభుత‍్వం ఏర‍్పడిన కొద్ది కాలంలోనే విద్యుత్ కొరతను అధిగమించామని ముఖ‍్యమంత్రి కేసీఆర్ చెప్పారు. బుధవారం అసెంబ్లీలో సభ‍్యులు అడిగిన ప్రశ‍్నలకు సమాధానం చెప్పిన సీఎం…రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు ఎంతో విద్యుత్ కొరత ఉండేదని…కానీ ప్రస్తుతం ఆ పరిస్ధితి లేదని తెలిపారు. విద్యుత్ రంగంలో తెలంగాణ ముందడుగు వేసిందన్నారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించామని వెల్లడించారు. దీంతో ఉద్యోగులకు భద్రత లభిస్తుందని సీఎం తెలిపారు.రైతులకు 9 గంటల పాటు నిరంతర విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలో మొత్తం 7371 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని తెలిపిన సీఎం రాష్ర్టానికి 8284 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

- Advertisement -