ఆ నిధులలో కేంద్రానిది న‌యా పైసా లేదు- సీఎం కేసీఆర్‌

66
- Advertisement -

నేడు శాస‌న‌స‌భ‌లో హ‌రిత‌హారంపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ చేప‌ట్టిన సంద‌ర్భంగా స‌భ్యులు మాట్లాడిన అనంత‌రం సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ సందర్భంగా సభలో సీఎం మాట్లాడుతూ.. కాంపా నిధులు కేంద్ర ప్ర‌భుత్వానివి కావు. 100 శాతం అది రాష్ట్రాల డ‌బ్బులు మాత్ర‌మే అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. నీటి ప్రాజెక్టులు, రోడ్ల‌కు, లేదా ఇత‌ర అవ‌స‌రాల కోసం అట‌వీ భూముల‌ను కొనుగోలు చేస్తాం. అడ్వాన్స్ కింద రాష్ట్రాలు కేంద్రానికి డ‌బ్బులు చెల్లించాలి. ఈ క్ర‌మంలో తెలంగాణ నుంచి కేంద్రం వ‌ద్ద జ‌మ చేసిన డ‌బ్బు రూ. 4675 కోట్లు. ఇవి మ‌నం క‌ట్టిన డ‌బ్బులే. కేంద్రానిది న‌యా పైసా కూడా లేదు. అయితే మోదీని క‌లిసి కాంపా నిధులు విడుద‌ల చేయాల‌ని కోరాం. మొత్తానికి 4 సంవ‌త్స‌రాల త‌ర్వాత విడుద‌ల చేశారు. అయితే మ‌న‌కు ఇచ్చే నిధుల్లో 10 శాతం కేంద్రం క‌ట్ చేస్తుంది. మొత్తం ఇవ్వాల‌ని అడిగాం. ప‌రిశీల‌న చేస్తామ‌ని కేంద్రం చెప్పిందన్నారు.

కాంపా నిధుల్లో భాగంగా రాష్ట్రానికి రూ. 3,109 కోట్లు నిధులు విడుద‌ల చేశారు. ఇందులో రూ. 1320 కోట్లు ఖ‌ర్చు పెట్టాం. న‌రేగా కింద రూ. 3673 కోట్లు ఖ‌ర్చు చేశాం. హెచ్ఎండీఏ ద్వారా రూ. 367 కోట్లు, జీహెచ్ఎంసీ ద్వారా రూ. 83 కోట్లు ఖ‌ర్చు చేశాం. న‌ర్సీర‌ల పెంప‌కం, ఏర్పాటు, కూలీలు, మొక్క‌ల స‌ర‌ఫ‌రా, నీటి ర‌వాణాకు ఖ‌ర్చు చేశాం. నిధుల దుర్వినియోగం జ‌ర‌గ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం కోసం రూ. 6,555 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు.

మ‌న రాష్ట్రంలో పంచాయ‌తీరాజ్ కింద 67,276 కి.మీ. ఆర్ అండ్ బీ కింద‌ 28,080 కి.మీ. నేష‌న‌ల్ హైవేస్ కింద 4 వేల కి.మీ. ఉన్నాయి. అన్నీ క‌లిపితే 1,00,156 కి.మీ. మేర రోడ్ లెంత్ ఉంది. ఇందులో 82491 కి.మీ. మేర‌ ప్లాంటేష‌న్ చేశారు. పంచాయ‌తీరాజ్ కింద 59 వేల కిలోమీట‌ర్లు క‌వ‌ర్ చేశారు. ఆర్ అండ్ బీ వారు 8652 కి.మీ. మేర మొక్క‌లు నాటారు. ఫారెస్టు డిపార్ట్‌మెంట్ అధికారులు.. జాతీయ ర‌హ‌దారుల‌పై మొక్క‌లు నాటి, వారి ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు అని సీఎం కేసీఆర్ వివరించారు.

- Advertisement -