యాదాద్రి జిల్లా ఏర్పాటును ఎవరూ ఊహించలేదు -సీఎం కేసీఆర్

48
- Advertisement -

సీఎం కేసీఆర్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, యాదాద్రి ఓ జిల్లాగా ఏర్పడుతుందని ఎవరూ ఊహించలేదని, ఇవాళ కలెక్టరేట్ భవనం ప్రారంభించడం సంతోషం కలిగిస్తోందని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే పలు జిల్లాలను ఏర్పాటు చేయాలని భావించామని తెలిపారు. ‘అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేయాలని నాడు ఎన్టీఆర్ ను కూడా అడిగాం. ఆయన కూడా మంచిర్యాలను జిల్లాగా చేస్తానని అన్నారు. ఎందుకో గానీ అది సాధ్యపడలేదు. అనేక అపోహలు అందుకు ప్రతికూలంగా మారాయి’ అని తెలిపారు.

భువనగిరి జిల్లా ఏర్పాటు చేసుకొని, అద్భుతమైన జిల్లా కలెక్టరేట్‌కు ప్రారంభించింకున్నందుకు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్‌ను అభినందిస్తున్నాను. ఎప్పుడు ఎవరూ ఊహించిన మాట కాదు. భువనగిరి జిల్లా అయిదని కలలో ఎవరూ అనుకున్న మాట కాదు. అందరికీ అన్ని విషయాలు అర్థం కావు అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -