- Advertisement -
ఎన్నికల తర్వాత అర్హులందరికీ వరద సాయం అందిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో ప్రజా ప్రతినిధులతో సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్….బీజేపీ తీరును తప్పుబట్టారు.
వరద బాధితులకు ప్రభుత్వం మానవత దృక్పథంతో అందిస్తున్న సాయాన్ని బీజేపీ, ప్రతిపక్షాలు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కేంద్రం ఒక్క పైసా ఇవ్వదు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలన్నారు. ప్రజలు ప్రతిపక్షాల వైఖరిని గమనించి తగిన బుద్ది చెప్పాలన్నారు.
- Advertisement -