శాంతి లేనినాడు జీవితం ఆటవికమైతదన్నారు సీఎం కేసీఆర్. మరుగుజ్జులు ఎన్నడూ మహాత్ములు కాలేరన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన సీఎం…దేశం బాగుంటే.. సమాజం బాగుంటే, ప్రపంచంలో శాంతి సామర్యాలు ఉంటేనే మనం సుఖవంతమైన జీవితం కొనసాగించగలుగుతాం అన్నారు.
శాంతి, సౌభ్రాతృత్వంతో విలసిల్లే భారతదేశంలో మహాత్ముడినే కించపరిచే మాటలు వింటున్నాం. ఆ విన్నప్పుడు హృదయం బాధపడుతుంది. సమాజాన్ని చీల్చే కొన్ని చిల్లర మల్లర శక్తులు ప్రయత్నాలు చేసే విషయం మీ అందరికి తెలుసు అన్నారు. ఏ రోజుకైనా విశ్వ మానవుడిగా, విశ్వజనీన సిద్ధాంతాన్ని చెప్పిన గాంధీజీ చెప్పిన సిద్ధాంతమే ఉంటుందన్నారు.
మనకండ్ల ముందే దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించాలి. సమకాలిన సమాజంలో మనం భాగస్వాములం కాబట్టి బాధ్యత ఉంటుంది. మనం మౌనంగా ఉండొద్దు.. చెడును ఖండించాలి, తప్పును విమర్శించాలి, మంచిని ప్రశంసించి, ప్రోత్సహిస్తేనే సమాజానికి ఆరోగ్యం అన్నారు.