సిరిసిల్లకు సీఎం కేసీఆర్..

183
cm kcr
- Advertisement -

సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో పాటు పల్లె, పట్టణ ప్రగతి పనులను పర్యవేక్షించనున్నారు సీఎం. ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరనున్న సీఎం కేసీఆర్.. 10.30 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి గ్రామానికి చేరుకుంటారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 7 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు.

సీఎం కేసీఆర్‌ రాక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం టూర్ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అన్ని కార్యాలయాలను సందర్శించి పలు సూచనలు చేశారు.

- Advertisement -