తెలంగాణ అభివృద్ధిని అడుగు అడుగున కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్నదని తెలంగాన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు వారికి 40సంవత్సరాలు అవకాశమిచ్చారని,అయినా కాంగ్రెస్ పాలకులు అభివృద్ధి చేయలేదని, ప్రజలను వారు ఓటు బ్యాంకులుగా చూశారు తప్ప వారి క్షేమం గురించి కనీస ఆలోచనచేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నాయకులకు నిద్రపట్టడంలేదని ఆయన అన్నారు.
తెలంగాణ 60సంవత్సరాల పాటు వెనకబాటుకు గురైన రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్టు కడదామన్న అడుగడుగునా పనిగట్టుకుని మరి అడ్డుకుంటున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు అడ్డుకోవడం కోసం ఓ బ్యాచ్ తయారైందని,….తెలంగాణలో ఏమూలన ప్రాజెక్టు కోసం శంకుస్థాపన జరిగినా అక్కడి ప్రజలను రెచ్చగొట్టి ప్రాజెక్టును ఎలాగైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం అన్నారు. పర్యావరణ అనుమతుల్లేవని గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్తున్నారని, ఇంతకన్న దౌర్భాగ్యం ఇంకోటి ఉండదని సీఎం కేసీఆర్ అన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా ప్రాజెక్టులు కట్టలేదని, ప్రాజెక్టు కట్టే ముందు పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తారు. ఆలస్యం కాకూడదని, ఆ అనుమతులు వచ్చేలోపు పనులు ప్రారంభించడం తప్పా?, దీనిపై కొంత మంది కాంగ్రెస్ నేతలు గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి ప్రాజెక్టులను ఆపుతున్నారని, ఇది ప్రజల అభివృద్ధి కోరుకునేవారు చేసే పని కాదని, అభివృద్ధి నిరోధకులే ఇలాంటి పనులు చేస్తారని సీఎం కేసీఆర్ అన్నారు.
ఆంధ్రా పాలనలో అప్పటి సీఎంలకు సంచులు మోసిన బతుకులు అని సీఎం దుయ్యబట్టారు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ నేతల కాళ్లకింద భూమి కదులుతున్నదని సీఎం విమర్శించారు. వారి పాలనలో ఏనాడూ ప్రజల పట్ల మంచి ఆలోచనలు చేయలేదని, ఎన్నికల్లో చీప్ లిక్కర్లు పంచడం తప్ప ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ నేతలకు పట్టదని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. వారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు సీఎం ఈసందర్బంగా స్పష్టం చేశారు.