- Advertisement -
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీ తిరుగు ప్రయాణమయ్యారు. రామ్‌నాథ్ కోవింద్ తెలుగు ప్రపంచ మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయనకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రత్యేక విమానంలో రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీకి వెళ్ళారు.
రాష్ట్రపతికి వీడ్కోలు పలకడానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, క్యాబినెట్ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, తదితరులు కూడా ఎయిర్‌పోర్టుకు వచ్చారు.
అంతకు ముందు హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి.. హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహాన్ని కూడా సందర్శించారు. మరోవైపు రెండు మూడు రోజుల్లో శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్నారు రాష్ట్రపతి కోవింద్.
..
- Advertisement -